Hyderabad: మాతో రండి.. మూసీ ప్రక్షాళనకు ఒక్కరు ఒప్పుకున్నా.. మేం వెనక్కి తగ్గుతాం: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలపై వ్యవహరిస్తున్న తీరును బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(Eleti Maheshwar Reddy) తీవ్రంగా ఖండించారు.

Update: 2024-10-25 08:55 GMT

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలపై వ్యవహరిస్తున్న తీరును బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(Eleti Maheshwar Reddy) తీవ్రంగా ఖండించారు. మూసీ సుందరీకరణ(Mousse beautification) పేరుతో సర్వే చేయించి.. పేదల ఇళ్లను లాక్కొని వారిని రోడ్డున పడేశే చర్యలు తీసుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ క్రమంలోనే మూసీ బాదితులకు అండగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆద్వర్యంలో హైదరాబాద్(Hydrabad) లోని ధర్నా‌చౌక్ వద్ద మహాధర్న నిర్వహించారు. దీనికి తెలంగాణ బీజేపీ(BJP) ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(Maheshwar Reddy) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి కీలక సవాల్ విసిరారు. సీఎం రేవంత్‌ తమతో కలిసి మూసీ పర్యటనకు రావాలని, మూసీ ప్రక్షాళనకు ఒక్కరు ఒప్పుకున్నా.. మేం వెనక్కి తగ్గుతామని ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి చాలెంజ్ చేశారు. కేవలం కాంగ్రెస్ నేతలకు కమీషన్ల కోసమే సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని.. కమీషన్ల కోసం పేద ప్రజలను రోడ్డున పడేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని.. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తేల్చి చెప్పారు.


Similar News