MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి సీరియస్
బాబ్రీ మసీద్ ఇష్యూలో బీజేపీ హస్తం ఏమాత్రం లేదని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బాబ్రీ మసీద్ ఇష్యూలో బీజేపీ హస్తం ఏమాత్రం లేదని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. బాబ్రీ మసీద్ ఇష్యూ వెనుక బీజేపీ ఉందని అక్బరుద్దీన్ ఎలా అంటారని ప్రశ్నించారు. సభ్యుడిగా పచ్చి అబద్ధాలు చెప్పడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంఐఎం నేతలు అవమానించేలా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో కారు స్టీరింగ్ ఎంఐఎం నేతల చేతుల్లో ఉందని, ఆ సమయంలో కారులో హాయిగా ప్రయాణం చేశారని, అక్కడ సంసారం కుదరకపోవడంతో బీజేపీపై విమర్శలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
బీజేపీపై విమర్శలు చేస్తే ఊరుకోబోమన్నారు. బాబ్రీ మసీదు ఇష్యూలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఏలేటి డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే కాదని, బీజేపీ ఎమ్మెల్యేలం 8 మంది ఉన్నామని, తమకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. తాము థర్డ్ లార్జెస్ట్ పార్టీ అని చెప్పారు. తమకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. ఇకపోతే డిప్యూటీ సీఎం భట్టి మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి పెట్టలేదని అంటున్నారని, పేజీ నంబర్ 9లో ఉందని, కావాలంటే చూడొచ్చని ఏలేటి సూచించారు.