డీఎంహెచ్ కార్యాలయం వద్ద బీజేపీ మహిళా మోర్చ నేతల ఆందోళన
కోఠీ డీఎంహెచ్ కార్యాలయం వద్ద బీజేపీ మహిళా మోర్చ నిరసనకు దిగింది.
దిశ, డైనమిక్ బ్యూరో: కోఠీ డీఎంఈ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆశా వర్కర్లకు వేతనాలు చెల్లించడం లేదని బీజేపీ మహిళా మోర్చా నేతలు ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం డీఎంఈ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించగా మహిళా మోర్చ నేతలను పోలీసుల అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో మహిళా మోర్చా నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డా శిల్పా రెడ్డి మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా ఇవ్వని పెండింగ్‌లో ఉన్న జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఆశావర్కర్ల జీతం రూ. 9 వేల నుంచి 18 వేలకు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు జీతాల పెంపు హామీ నెరవేర్చలేదని ఇకనైనా ఆశావర్కర్ల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.