కాంగ్రెస్ నుండి సస్పెండ్ అవ్వడం కోసమే కోమటిరెడ్డి కామెంట్స్: మురళీధర్ రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ఎంఐఎం నట్ బోల్టులన్ని సీఎం కేసీఆర్ దగ్గరే ఉన్నాయని బీజేపీ సీనియర్ నేత, బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ చార్జ్ మురళీధర్ రావు అన్నారు.

Update: 2023-02-15 11:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎంఐఎం నట్ బోల్టులన్ని సీఎం కేసీఆర్ దగ్గరే ఉన్నాయని బీజేపీ సీనియర్ నేత, బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ చార్జ్ మురళీధర్ రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. బుధవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మురళీధర్ రావు.. తెలంగాణలో లెఫ్ట్ పార్టీల ప్రభావం అంతగా లేదని.. వారికి పెద్దగా ఓటు బ్యాంకు లేదన్నారు.

తొందరపడి కోయిల ముందే కూసినట్లుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. బహుశా కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయడానికే కోమటిరెడ్డి అలా మాట్లాడి ఉండవచ్చని అన్నారు. ఎంత మంది బీజేపీలో చేరినా కాంగ్రెస్‌లో మాదిరిగా ఇక్కడ పరిస్థితి ఉండదని.. చేరిన వారికి పార్టీ ఎదో ఒక బాధ్యత అప్పగిస్తుందన్నారు. తమ పార్టీలో చేరికల ద్వారా ఒరిజినల్ క్యాడర్ ఎక్కడ ఇబ్బంది పడటం లేదన్నారు.

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నానని తప్పకుండా పోటీ చేస్తాన్నారు. బీబీసీ మోడీ ఒక్కడిపైనే ఎటాక్ చేయడం లేదని హిందూ సింబల్స్‌పై కూడా ఆ సంస్థ దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. భారత ప్రజలకు వ్యతిరేకంగా బీబీసీ ప్రసారాలు ఉంటున్నాయన్నారు. రాహుల్ గాంధీ ఏది మాట్లాడినా భూమ్ రాంగ్ అవుతుందని విమర్శించారు. కర్ణాటకలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ఛాలెంజింగ్ వంటిదని.. అక్కడ తమ పార్టీ బలంగా ఉందన్నారు. కర్ణాటక క్యాస్ట్ ఆర్గనైజేషన్ ఓరియెంటెడ్ స్టేట్ అని అభిప్రాయపడ్డారు. యడ్యూరప్ప కేసీఆర్ కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ అని చెప్పుకొచ్చారు.

Also Read...

CM కేసీఆర్‌కు బిగ్ షాక్.. తిరిగి BJP గూటికి చేరే యోచనలో కీలక నేత..? 

Tags:    

Similar News