టీఆర్ఎస్‌పై బీజేపీ 'సోషల్' అస్త్రం.. వారియర్స్ కోసం వేట
దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఎన్నికల్లో
దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ ఇప్పటినుంచే వ్యూహలు పన్నుతోంది. సర్వశక్తులు ఒడ్డి కేసీఆర్‌ను గద్దె దించాలనే ప్రయత్నంలో ఉంది. అందుకు గాను అవకాశం ఉన్న అన్న అస్త్రాలను ప్రయోగిస్తోంది. ప్రధానంగా టీఆర్‌ఎస్‌కు పోటీగా సోషల్ మీడియాలో ఉపయోగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రచారం కోసం సోసల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా వారియర్స్‌ను సిద్ధం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. అందుకోసం సోషల్ మీడియా వాలంటీర్ల కోసం తెలంగాణ బీజేపీ ఐటీ, సోషల్ మీడియా వింగ్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీని కోసం ఒక ఆన్ లైన్ దరఖాస్తు ఫారంను విడుదల చేసింది. ఆసక్తిగల వారు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది.