Dharna Chowk : రేపు ధర్నా చౌక్‌లో రైతు దీక్ష.. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
బీజేపీ ఆధ్వర్యంలో "రైతు హామీల సాధన దీక్ష" చేయబోతున్నట్లు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి తెలిపారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ ఆధ్వర్యంలో "రైతు హామీల సాధన దీక్ష" చేయబోతున్నట్లు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా కీలక ప్రకటన చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబరు 30 ఉదయం నుంచి అక్టోబరు 01 ఉదయం వరకు హైదరాబాదులోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన దీక్ష చేయనున్నట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నామన్నారు. అన్నం పెట్టే అన్నదాతలకు అండగా నిలవాలని, రైతు దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.