మూడు జిల్లాల్లోనే బీజేపీ ఖాతా.. ఏడు ఉమ్మడి జిల్లాల్లో నిల్

పట్టణ ప్రాంతాల్లో తీవ్రంగా ప్రభావం చూపుతుందనుకున్న బీజేపీ ఉనికి ఈ ఎన్నికల్లో ఏమాత్రం కనిపించలేదు.

Update: 2023-12-03 17:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : పట్టణ ప్రాంతాల్లో తీవ్రంగా ప్రభావం చూపుతుందనుకున్న బీజేపీ ఉనికి ఈ ఎన్నికల్లో ఏమాత్రం కనిపించలేదు. గ్రేటర్ పరిధిలో గతంలోని ఒక్క స్థానానికే మరోసారి పరిమితమైంది. హైదరాబాద్ పరిధిలో కార్వాన్, యాకుత్ పురలో హోరాహోరీ కనిపించినా చివరకు ఎంఐఎం నేతలు గెలిచారు. కాగా ఉత్తర తెలంగాణకు చెందిన జిల్లాల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ లో ఏడు స్థానాలు గెలుచుకుంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ తో పాటు సిర్పూర్, నిర్మల్, ముధోల్ లో గెలిచింది. ఉమ్మడి నిజామాబాద్ లో నిజామాబాద్ అర్బన్ తో పాటు ఆర్మూర్, కామారెడ్డి గెలుపొందింది. హైదరాబాద్ జిల్లాలో కేవలం గోషామహల్ కు మాత్రమే కాషాయ పార్టీ పరిమితమైంది. ఉమ్మడి ఏడు జిల్లాల్లో బీజేపీ ఖాతా కూడా తెరవకుండానే చతికిలపడింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డిలో అనుకున్న స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయింది.

బీజేపీ గెలిచిన స్థానాలివే..

అసెంబ్లీ                  గెలుపొందిన అభ్యర్థి పేరు

సిర్పూర్                  పాల్వాయి హరీశ్ బాబు

ఆదిలాబాద్             పాయల్ శంకర్

నిర్మల్                  ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముధోల్                  రామారావు పవార్

ఆర్మూర్                  పైడి రాకేశ్ రెడ్డి

కామారెడ్డి                     కాటెపల్లి వెంకటరమణారెడ్డి

నిజామాబాద్ అర్బన్     ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త

గోషామహల్                 రాజాసింగ్


Similar News