Bike Accident: షాకింగ్ ఘటన.. టిప్పర్ ఢీ కొట్టడంతో బైకులో మంటలు
మెదక్ జిల్లా(Medak District) తుఫ్రాన్(Thufran) లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: మెదక్ జిల్లా(Medak District) తుఫ్రాన్(Thufran) లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టిప్పర్(Tipper) ఢీ కొట్టడంతో బైకు(Bike) లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. తుఫ్రాన్ పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా(Narsapur Chourastha) వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్ ను మట్టిలోడ్ తో వెళ్తున్న ఓ టిప్పర్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ బైక్ పై నుంచి వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైక్ రైడర్ కు మంటల్లో చిక్కుకొని తీవ్ర గాయలు అయ్యాయి. స్థానికులు అతన్ని మంటల్లో నుంచి రక్షించి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృష్యాలు దగ్గరలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.