BIG News: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రాష్ట్రంలో కొత్తగా 30,750 ఉద్యోగాలు

విదేశీ పెట్టుబడులే టార్గెట్‌గా సాగిన సీఎం రేవంత్ అమెరికా పర్యాటన విజయవంతంగా ముగిసింది.

Update: 2024-08-12 03:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: విదేశీ పెట్టుబడులే టార్గెట్‌గా సాగిన సీఎం రేవంత్ అమెరికా పర్యాటన విజయవంతంగా ముగిసింది. అనంతరం ఆయన దక్షిణ కొరియాలోని సియోల్‌కు పయనమయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి రూ.31,532 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ముందుకు వచ్చనట్లుగా సీఎం అధికారిక వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఉన్న భౌగోళిక పరిస్థితులు, ఇండస్ట్రియల్ పాలసీలను పలు కంపెనీల యాజమాన్యాలకు వివరించడంలో సీఎం రేవంత్ ఫుల్ సక్సెస్ అయ్యారు. మొత్తం 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఎంవోయూలు కూడా చేసుకున్నాయి. ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా యువతకు మరో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రభుత్వం ఎంవోయూ చేసుకున్న మల్టీ నేషనల్ కంపెనీల్లో కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం, కార్నింగ్‌, ఆమెజాన్, జొయిటిస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్, అమెజాన్ కంపెనీలు ఉన్నాయి. 

Tags:    

Similar News