BIG News: సెన్సార్ బోర్డు సభ్యత్వం ఇష్యూలో మాజీ ఎమ్మెల్సీపై కేసు నమోదు!
మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది.
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. సెన్సార్ బోర్డులో సభ్యత్వం ఇప్పిస్తామని చెప్పి పలువురిని మోసం చేసిన కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినట్లుగా సమాచారం. ప్రవీణ్ అనే వ్యక్తితో కలిసి రూ.10 లక్షల మేర నగదు వసూలు చేసి మొండిచేయి చూపారని ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదైందని సమాచారం. ఈ మేరకు కపిలవాయి దిలీప్ కుమార్ కోర్టును ఆశ్రయించారని తెలుస్తోంది. ఈ క్రమంలో వెంటనే ఆయనకు నోటీసులు జారీ చేయాలంటూ న్యాయస్థానం పోలీసులను ఆదేశించిందని, ఈ మేరకు మంగళవారం ఆయన నోటీసు తీసుకునేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారని సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.