అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లకు భారీ శుభవార్త.. అధిక జీతాలతో పాటు!!
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్ల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్ల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా అంగనవాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడారు. అంగన్‌వాడీలకు 18 వేల రూపాయలు జీతం చెల్లించాలిని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రిటైర్‌మెంట్ బినిఫిట్ టీచర్లకు 10 లక్షల రూపాయలు, హెల్పర్లకు రూ. 5 లక్షలు చెల్లించాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. అంగన్ వాడీ సెంటర్లకు సొంత భవనాలు నిర్మించాలని పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో త్వరలోనే అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్ల సమస్యలు తీరిపోనున్నాయని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో అసోషియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమతమ్మ, శాంతబాబు, బి. రాణి, శాంతకుమారి, కోట్ల శోభ, అన్నపూర్ణ, అంజలి, జ్యోతి, స్వప్న, సరిత, విజయ, రమణ, తారక, జయంతి, ప్రభావతి, వనజ, సుజిత తదితరులు పాల్గొన్నారు.