HYD : ‘క్యూనెట్‌’ పేరుతో ఘరానా మోసం.. ముగ్గురు అరెస్ట్

క్యూనెట్‌తో కలిసి ఆకర్షణీయమైన లాభాలు ఇప్పిస్తామంటూ కోట్లకు ముంచిన వీ అంపైర్ ​సంస్థకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2023-05-30 15:00 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: క్యూనెట్‌తో కలిసి ఆకర్షణీయమైన లాభాలు ఇప్పిస్తామంటూ జనాన్ని కోట్లాది రూపాయలకు ముంచిన వీ అంపైర్​సంస్థకు చెందిన ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలం క్రితం సికింద్రాబాద్​స్వప్నలోక్ కాంప్లెక్సులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ సంస్థకు చెందిన ఆరుగురు ఉద్యోగులు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్​పోలీస్​కమిషనర్​సీ.వీ.ఆనంద్​మంగళవారం పోలీస్​కమాండ్​కంట్రోల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ప్రకాశం జిల్లాకు చెందిన ప్రస్తుతం బెంగళూరులో నివాసముంటున్న జీ.రాజేశ్​ఎలియాస్ రాజేశ్​ఖన్నా, హిమాయత్​నగర్​వాస్తవ్యుడు మనీష్​కత్తి, మలక్​పేట నివాసి సయ్యద్​అజ్మల్​మెహదీ సజ్జాద్​కలిసి క్యూనెట్, విహాన్​డైరెక్ట్​సెల్లింగ్​ఇండియా ప్రైవేట్​లిమిటెడ్​సంస్థలతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. ఆ తరువాత స్వప్నలోక్​కాంలప్లెక్స్‌లో వీ–ఎంపైర్​పేర సంస్థను ప్రారంభించారు. తమ వద్ద లక్ష అంతకు మించి పెట్టుబడులు పెడితే దండిగా లాభాలు సంపాదించవచ్చంటూ నిరుద్యోగ యువతీ, యువకులను ఉచ్ఛులోకి లాగారు. ఈ క్రమంలో మహంకాళి పోలీస్​స్టేషన్‌లో కొన్ని రోజుల క్రితం మూడు కేసులు నమోదయ్యాయి.

ఆ తరువాత ఈ కేసులను సీసీఎస్‌కు బదిలీ చేశారు. సీసీఎస్​అధికారులు జరిపిన విచారణలో మొత్తం 12మంది నిందితులు అధిక లాభాల ఆశ చూపించి పలువును నిరుద్యోగ యువతీ, యువకులను వలలోకి లాగినట్టుగా వెల్లడైంది. కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న రాజేశ్​ఖన్నా మిగితా నిందితులతో కలిసి మోటీవేషన్​క్లాసులను నిర్వహించి మరీ యాభై వేల నుంచి లక్షన్నర రూపాయలు తమ సంస్థలో పెట్టుబడులుగా పెడితే నెలకు ఇరవై వేల నుంచి అరవై వేల వరకు సంపాదించవచ్చని చెప్పి నిరుద్యోగులను ముగ్గులోకి లాగేవాడని తేలింది.

ఈ మాటలు నమ్మిన వారితో తామిచ్చే ప్రొడక్టులను డైరెక్టుగా అమ్మించేవారని వెల్లడైంది. అయితే, 2017లోనే తెలంగాణ ప్రభుత్వం ఇలా డైరెక్టుగా ఉత్పత్తులను విక్రయించటాన్ని నిషేధించినట్టు కమిషనర్​ఆనంద్​చెప్పారు. దర్యాప్తులో భాగంగా మొత్తం నూటా యాభై మంది బాధితులను విచారించినట్టు తెలిపారు. దీంట్లో బాధితులు రూ.మూడు కోట్ల రూపాయలకు పైగా నష్టపోయినట్టుగా వెల్లడైందని వివరించారు. ఈ క్రమంలో విహాన్​డైరెక్ట్​సెల్లింగ్​ప్రయివేట్​లిమిటెడ్ సంస్థ పేర వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న ముప్పయి అయిదు ఖాతాలను ఫ్రీజ్ చేసినట్టు చెప్పారు. ఈ ఖాతాల్లో మొత్తం యాభై నాలుగు కోట్ల రూపాయలు ఉన్నట్టుగా తెలిపారు.

సభ్యత్వం తీసుకుని..

ఇక, కేసులో నిందితులుగా ఉన్న మనీష్​కత్తి, సయ్యద్​అజ్మల్​మార్కెటింగ్​ఇన్​ఛార్జీలుగా పని చేసేవారని కమిషనర్​సీ.వీ.ఆనంద్​చెప్పారు. ఈ ఇద్దరు కలిసి తమ వద్ద రూ.8వేల 991 రూపాయలు సభ్యత్వ రుసుముగా కడితే సంస్థ రూ.9వేల రూపాయల విలువ చేసే ఉత్పత్తులు ఇస్తుందని ప్రచారం చేసినట్టు తెలిపారు. దీంతోపాటు సభ్యులుగా చేరిన వారు తమ తమ ఇళ్లల్లో లేదా దుకాణాల్లో తమ సంస్థకు చెందిన బోర్డును ఏర్పాటు చేస్తే నెలకు రూ.11వందల రూపాయల చొప్పున ముప్పయి ఆరు నెలలపాటు ఇస్తామని నమ్మించినట్టు చెప్పారు.

సూపర్​మార్కెట్​స్కీం...

దీంతోపాటు సూపర్​మార్కెట్​స్కీం పేర కూడా నిందితులు పెద్ద మొత్తాల్లో జనాన్ని మోసం చేసినట్టు కమిషనర్​సీ.వీ.ఆనంద్​తెలిపారు. తక్కువలో తక్కువగా రూ.25లక్షల రూపాయల పెట్టుబడి పెడితే సంస్థ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించటంతో పాటు షాపు అద్దె, సిబ్బంది జీతాలు భరించి విక్రయించే హెల్త్​ప్రొడక్టులపై 5 శాతం, నిత్యావసర సరుకులపై రెండున్నర శాతం కమీషన్​ఇస్తుందని చెప్పి పలువురిని నమ్మించినట్టు వివరించారు. ఇలా సూపర్​మార్కెట్​ఏర్పాటు చేసుకుంటే నెలకు లక్ష రూపాయల వరకు లాభాలను సులభంగా సంపాదించవచ్చని ప్రచారం చేశారన్నారు. ఇది నమ్మి ఉభయ తెలుగు రాష్ర్టాలకు చెందిన 44మంది ఈ సంస్థలో రూ.25లక్షల రూపాయల చొప్పున పెట్టుబడులు పెట్టి నిండా మునిగినట్టు చెప్పారు. స్కీముల్లో చేరండి...లాభాలు పొందండి అంటూ ఇలా ప్రచారం చేసే సంస్థలను నమ్మవద్దని కమిషనర్​సూచించారు. కేసు దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేసిన ఆర్థిక నేరాల విభాగం ఏసీపీ అశోక్​కుమార్, ఎస్ఐ నరేందర్, హెడ్​కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, రామకృష్ణలను కమిషనర్​అభినందించారు.

Tags:    

Similar News