Big Alert: న్యూ ఇయర్ విషెస్ పేరుతో మోసాలు.. జాగ్రత్తగా ఉండండి: పోలీసులు

దేశంలో ఇటీవల కాలంలో సైబర్ మోసాలు(Cyber ​​Frauds) విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.

Update: 2024-12-31 10:30 GMT

దిశ,వెబ్‌డెస్క్: దేశంలో ఇటీవల కాలంలో సైబర్ మోసాలు(Cyber ​​Frauds) విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. సైబర్ నేరగాళ్లు(Cyber ​​Criminals) రోజుకో కొత్త పంథా ఎంచుకొని దోపిడీకి పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్(New Year)ను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని రాచకొండ పోలీసులు(Rachakonda Police) హెచ్చరిస్తున్నారు. న్యూ ఇయర్ విషెస్(Wishes), డిస్కౌంట్ల(Discounts) పేరుతో కేటుగాళ్లు డబ్బు దోచుకునే ప్రమాదముందని తెలిపారు. ఫ్రీ ఈవెంట్ పాసులు, అప్లికేషన్ ఫైల్స్, ఆకర్షణీయమైన చిత్రాలు, మెస్సేజులు మీ పేరుతో పంపాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి అంటూ లింక్స్ పంపుతున్నారని, ఆ లింక్స్ పై క్లిక్ చేస్తే మీ పర్సనల్ డేటా(Personal Data) చోరీ లేదా బ్యాంక్ ఖాతాలను(Bank Accounts) ఖాళీ చేసే అవకాశముందని చెబుతున్నారు. లింక్స్ క్లిక్ చేయమని కోరే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1903 అనే హెల్ప్ లైన్ నంబర్(Help Line No)కు కాల్ చేయాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ వెబ్ సైట్ https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

Tags:    

Similar News