మండి బిర్యానీ లవర్స్‌కు BIG అలర్ట్.. ఆ ఫ్యామిలీలో అందరికీ అస్వస్థత
హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బిర్యానీ. నగరానికి ఎవరొచ్చిన ముందుగా బిర్యానీ తిన్నాకే మిగతా పని చూసుకుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బిర్యానీ. నగరానికి ఎవరొచ్చిన ముందుగా బిర్యానీ తిన్నాకే మిగతా పని చూసుకుంటారు. ఇటీవల కాలంలో బావర్చీ, పిస్తాహౌజ్ బిర్యానీతో పాటు మండి బిర్యానీ కూడా చాలా ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే నాణ్యత విషయంలో హోటల్ నిర్వహకులు కూడా నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారు. తాజాగా ఈ మండి బిర్యానీ తిని ఓ కుటుంబం మొత్తం అస్వస్థతకు గురైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని అప్పరెడ్డిగూడ గ్రామానికి చెందిన కావాలి నరేందర్ తన పెళ్లిరోజు సందర్భంగా ఈనెల 22న షాద్‌నగర్ పట్టణంలోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్‌కు వెళ్లారు. మండి బిర్యానీ ఆర్డర్ ఇచ్చి కుటుంబ సభ్యులతో కలిసి తిన్నారు. తర్వాత ఇంటికి చేరుకున్న కాసేపటికే ఒకరి తర్వాత ఒకరికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో నరేందర్‌తో పాటు అతని భార్య మంగమ్మ, కుటుంబ సభ్యులు దీక్షిత, తన్విక, అనిరుధ్, అభిలాష్, జోష్ణ, సాయి శ్రీకర్ మెుత్తం 8 మందిని శంషాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. రెస్టారెంట్‌లో సోదాలు చేసి బిర్యానీ శాంపిల్స్ సేకరించిన అధికారులు వంటగది పరిశుభ్రంగా లేకపోవడంతో కేసు నమోదు చేశారు.