చైర్మన్, ఫ్లోర్ లీడర్ల మధ్య బాహాబాహి
మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన మున్సిపల్ అధికారులతో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
దిశ, ఇల్లందు: మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన మున్సిపల్ అధికారులతో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కానీ ఇందుకు ఏ ఒక్క మున్సిపల్ కౌన్సిలర్‌కు సమాచారం ఇవ్వకపోవడంతో ఆ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరావు మాకు సమాచారం ఇవ్వకుండా రివ్యూ సమావేశం ఎలా నిర్వహిస్తారని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఫోన్లో చైర్మన్‌ను నిలదీయడంతో పాటు ఒక మధ్యవర్తి ద్వారా నేరుగా చైర్మన్ ఇంటికి వెళ్లినట్టు సమాచారం. ఈక్రమంలో చైర్మన్ ఇంట్లో రాత్రి 10.20 గంటల సమయంలో వారిరువురి మధ్య బహిబహిగా పరస్పర దూషణలతో పాటు దాడులు జరిగే పరిస్థితికి వెళ్లినట్టు సమాచారం. కొక్కు నాగేశ్వరరావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా రేపు పొద్దున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరిష్కరిద్దామని అక్కడున్న ఓ పెద్ద మనిషి సముదాయించినట్టు తెలుస్తుంది.