కులగణనపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన భట్టి విక్రమార్క

కులగణన(Caste Census) సర్వేపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Update: 2024-10-29 09:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : కులగణన(Caste Census) సర్వేపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 6 నుంచి కులగణన సర్వే చేయనుందని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సర్వే కార్యచరణపై నేడు భట్టి కలెక్టర్లతో మాట్లాడారు. ఇది వరకే కులగణనపై సామాజిక వేత్తలు, మేధావులతో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం అయింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, కులగణన సర్వేను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 6న మొదలయ్యే ఈ గణన నవంబర్ 30 నాటికి ముగియనుంది. సర్వే నిర్వహించేందుకు 80 వేల మందికి ప్రత్యేక శిక్షణను ఇవ్వనున్నట్లు భట్టి పేర్కొన్నారు.  

Tags:    

Similar News