అలర్ట్: బీసీ గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ విడుదల
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో 6,7,8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్న ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు
దిశ, తెలంగాణ బ్యూరో: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో 6,7,8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్న ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 295 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 6,7,8 తరగతుల్లో 5175 ఖాళీలు ఉండగా 69147 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
వాటిలో 6వ తరగతిలో 1976 సీట్లు ఖాళీగా ఉండగా 28,587 దరఖాస్తులు, 7వ తరగతిలో 1567 సీట్లు ఖాళీగా ఉండగా 21,278 దరఖాస్తులు, 8వ తరగతిలో 1632 సీట్లు ఖాళీగా ఉండగా 19282 దరఖాస్తులు వచ్చాయని ఆయన వివరించారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతో సహా 295 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తామని, ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని, అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని మల్లయ్య బట్టు విద్యార్థులకు సూచించారు.
ఇవి కూడా చదవండి: