200 కలర్స్, 20 డిజైన్లతో బతుకమ్మ చీరలు

దిశ, తెలంగాణ బ్యూరో: 20 డిజైన్లు... ప్రతి డిజన్ 10 కలర్లు... మొత్తం 200 కలర్స్.. 8 బార్డర్స్

Update: 2022-04-05 02:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: 20 డిజైన్లు... ప్రతి డిజన్ 10 కలర్లు... మొత్తం 200 కలర్స్.. 8 బార్డర్స్.. రూ.347కోట్లతో కోటి2లక్షల చీరలను రాష్ట్ర చేనేత, జౌళిశాఖ చేనేత చీరలను తయారు చేయిస్తోంది. చీరల తయారీపై ఆశాఖ పర్యవేక్షణ చేస్తోంది. ఆగస్టు చివరి నాటికి బతుకమ్మ చీరల తయారీ పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 40లక్షల చీరలు తయారయ్యాయని అధికారులు తెలిపారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండగ బతుకమ్మ. పల్లెల్లో గొప్పతనం, ప్రకృతిలోని అనేక పూలతో మమేకమైన ఈ పండగను పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా నిర్వహిస్తారు. ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మను జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 18 ఏళ్లు నిండిన యువతులకు చీరలు పంపిణీ చేస్తోంది. ఈ చీరల తయారీలో సాధారణ మరమగ్గాలకు డాబీ, జకాట్ పరికరాలను జోడించి ఆదునికీకరించిన వాటిపైనే నేయిస్తోంది. ఆగస్టు చివరి నాటికి చీరల తయారీని పూర్తిచేసేలా చర్యలు చేపట్టింది.

15 వేల మరమగ్గాలకు ఆర్డర్లు...

కార్మికుల నైపుణ్యాలను వెలికితీసి నూతన ఉత్పత్తులను రాష్ట్ర ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లను సిరిసిల్ల మరమగ్గాల వస్త్రోత్పత్తి పరిశ్రమలకు కేటాయిస్తోంది. ఈ ఏడాది మ్యాక్స్ సంఘాలు, ఎన్ఎస్ఈ యూనిట్ల పరిధిలోని 15వేల మరమగ్గాలకు అర్డర్లు ఇచ్చారు. దీంతో పాటు కరీంనగర్ గర్షకుర్తిలో 600, వరంగల్ లో 250 మగ్గాలలో చీరలను తయారు చేయిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 40 లక్షల చీరలు సైతం తయారైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.

రూ.347కోట్లతో....

ఈ ఏడాది బతుకమ్మ చీరల తయారీకి రూ.347కోట్లు కేటాయించింది. కోటి 2లక్షల చీరలకు ఆర్డర్స్ ఇచ్చారు. 20 డిజైన్లను తయారు చేస్తున్నారు. ప్రతి డిజైన్ ను 10 కలర్లు... 200 కలర్లతో చీరలను తయారు చేస్తున్నారు. ఈ చీరలన్నీ జరి అంచులతో 100శాతం పాలిస్టర్ ఫిలిమెంట్, నూలు తో తయారు చేశారు. వస్త్రాల నాణ్యత, తయారీ, ప్రింటింగ్, కొంగు,బార్డర్లు, ప్యాకేజీంగ్ వంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. మహిళలందరికీ పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 6.30 మీటర్ల పొడవుగల కోటి సాధారణ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధ మహిళల కోసం 9.00 మీటర్లు పొడవు గల చీరలు 8 లక్షలు తయారుచేయించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం మహిళలకు 9 మీటర్ల చీరలు పంపిణీకి 10లక్షలు ఆర్డర్స్ ఇచ్చారు. ఈ సారి బార్డర్ లోపల త్రెడ్ డిజైన్లతో నేయిస్తున్నారు. జరీ, సిల్వర్, గోడ్ల్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. బార్డర్ 8 కలర్స్ లలో ఉంటుంది. 2017 లో 95, 48,439 మహిళలకు, 2018 లో 96,70,474 మందికి, 2019 లో 96,57,813 మహిళలకు , 2020 లో 96,24,384 చీరలను పంపిణీ చేయగా, 2021 లో కోటి చీరలు, ఈ ఏడాదిలో కోటి 2లక్షల చీరలను పంపిణీ చేయనున్నారు.

చీరలను తయారు చేయిస్తున్నాం- శైలజారామయ్యర్, టెస్కో ఎండీ

ఈ ఏడాది 20 డిజైన్లను ప్రతి డిజైన్ ను 10 కలర్స్ మొత్తం విభిన్న రంగులతో అన్వయించి విస్తృత శ్రేణిలో 200 కలర్స్ తో చీరలను తయారు చేస్తున్నారు. ఆగస్టు చివరి నాటికి చీరలు కంప్లీట్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది కోటి 2 లక్షల చీరలను తయారు చేయిస్తున్నాం. చేనేత కార్మికుల ఆత్మహత్యలను నివారించేందుకు సిరిసిల్ల పవర్ లూమ్ క్లస్టర్ లో తయారు చేయిస్తున్నాం. నేత కార్మికుల నైపుణ్యాన్ని పెంచడంతో పాటు నూతన డిజైన్లు, ఉత్పత్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. అక్టోబర్ మొదటివారంలో ప్రతి గ్రామానికి చీరలు చేరవేసేలా చర్యలు తీసుకుంటాం. 

Tags:    

Similar News