ఎన్నికల వేళ Bandla Ganesh సంచలన నిర్ణయం.. ‘అన్నా వస్తున్నా’ అంటూ ట్వీట్
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, ప్రముఖ కమెడియన్ బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, ప్రముఖ కమెడియన్ బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్ అనే సినిమా తీసి ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే బండ్లన్న సినిమాలు, రాజకీయాలకు సంబంధించిన అంశాలపై స్పందిస్తుంటారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. 2018 ఎన్నికల వరకు యాక్టీవ్‌గా పనిచేసిన ఆయన.. కాంగ్రెస్ ఓడిపోవడంతో సైలెంట్ అయిపోయారు. రాజకీయాలకు గ్యాప్ ఇచ్చారు. తాజాగా.. ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రస్తుతం భట్టి పాదయాత్ర సూర్యాపేటలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘‘అన్నా వస్తున్నా అడుగులో అడుగేస్తా.. చేతిలో చెయ్యేస్తా.. కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోటానికి మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్’’ అంటూ ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ పేర్కొన్నారు.