'ఢిల్లీ లిక్కర్ కేసులో MLC కవిత దొరికిపోయారు'
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ
దిశ, వెబ్డెస్క్ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో కవిత దొరికిపోయారంటూ ఆయన కామెంట్స్ చేశారు.
చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కవిత ఏమైనా స్వాతంత్ర్య సమరయోధురాలా.. ఇంటి దగ్గర పెద్ద పెద్ద హోర్డింగులు ఎందుకు పెట్టుకున్నారు. సీబీఐ అధికారులు ఏం చాయ్, బిస్కేట్ తిని పోవడానికి రాలేదు అంటూ ఫైర్ అయ్యారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి, లిక్కర్ దందాలో తప్పుచేసి బీఆర్ఎస్ నాయకులంతా జైలుకు పోవాల్సిందేనన్నారు.