కాంగ్రెస్‌ సర్కార్‌ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర.. బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన భోగి వేడుకల్లో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మె్ల్యేల్లో కొంతమంది కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-01-14 06:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన భోగి వేడుకల్లో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మె్ల్యేల్లో కొంతమంది కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోయి తీవ్ర అసహనంలో ఉన్న కేసీఆర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏవైనా జరుగొచ్చు అని బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం, గౌరవం రెండూ లేవని విమర్శించారు. కుట్రలకు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ కల్వకుంట్ల ఫ్యామిలీ అని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా కేసీఆర్ కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు.

ఈ సమయంలో కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేయడం మానేసి.. ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటలిజెన్స్‌ను అప్రమత్తం చేయాలని హెచ్చరించారు. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాలేవని అన్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీతో సంబంధం లేదని తెలిపారు. అక్షింతల పంపిణీ పేరుతో రాజకీయం చేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు. యాదాద్రి పున:నిర్మాణం ముసుగులో భారీ రియల్ ఏస్టేట్ వ్యాపారం జరిగిందని ఆరోపించారు. కేసీఆర్‌లా అయోధ్యలో ప్రధాని మోడీ భూములు కొనుగోలు చేయలేదని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News