Bandi Sanjay: హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చిన బండి సంజయ్
ప్రతి ఒక్కరు తమ ఇళ్ల మీద జాతీయ జెండాను ఎగురవేసి, "హర్ ఘర్ తిరంగా" కార్యక్రమంలో భాగస్వాములం అవుదామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతి ఒక్కరు తమ ఇళ్ల మీద జాతీయ జెండాను ఎగురవేసి, "హర్ ఘర్ తిరంగా" కార్యక్రమంలో భాగస్వాములం అవుదామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. యాకుత్ పుర పరిధిలోని గౌలిపుర 36 వ డివిజన్ లో ప్రధాన మంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన ఆయన మన్ కీ బాత్ పై స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ప్రతి భారతీయుడిని ఏకం చేసే మువ్వన్నెల జెండాను మురిపెంగ మన ఇంటిపై ఎగరేసే ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి మన్ కీ బాత్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారని తెలిపారు. ఇవాళ్టి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని యాకుత్ పూర అసెంబ్లీ నియోజకవర్గం, గౌలిపుర - 36వ డివిజన్ లో కార్యకర్తలతో కలిసి వీక్షించానని అన్నారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు తమ ఇళ్ల మీద జాతీయ జెండాను ఎగురవేసి, సెల్ఫీ తీసుకొని http://harghartiranga.com లో అప్లోడ్ చెయ్యడంతో పాటు సోషల్ మీడియాలో పంచుకోవాలని సూచించారు. ఇక దేశాన్ని ఒక్కటి చేసే ఈ అద్భుత కార్యక్రమంలో మనమూ భాగస్వాములమవుదాం అని బండి సంజయ్ ఎక్స్ ద్వారా పిలుపునిచ్చారు.