KCR సర్కార్లో ప్రశ్నాపత్రాల లీకేజీ కామన్ అయిపోయింది: బండి సంజయ్
రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్రాపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా.. బీజేపీ స్టే్ట్ చీఫ్ బండి సంజయ్ స్పందించారు.
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్రాపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా.. బీజేపీ స్టే్ట్ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి తెలుగు ప్రశ్న పత్రం లికేజీ కావడం అత్యంత దురదృష్టకరం. కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తొంది. తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోంది. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం ఇంకా కొనసాగుతుండటం సిగ్గుచేటు. ప్రభుత్వ చేతగానితనం విద్యార్థుల జీవితాలకు శాపంగా మారింది. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.
పేపర్ లికేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల జీవితాలను దెబ్బతీస్తున్నాయి. ఈ లికేజ్ ఘటనతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. మిగిలిన పరీక్షలైనా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు రాసేలా పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ లికేజీ వెనకాల ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దు. బాద్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలి.’’ అని సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్ డిమాండ్ చేశారు.