తెలంగాణ శశికళగా కల్వకుంట్ల కవిత.. బక్క జడ్సన్ కౌంటర్!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన పేరు ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో రియాక్ట్ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2022-12-01 08:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన పేరు ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో రియాక్ట్ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కవిత స్పందిస్తూ వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే మోడీ కంటే ముందు ఈడీ వచ్చిందని, తనతో పాటు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ కేసులు పెడుతోందని ఇది బీజేపీ హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ అని అన్నారు. ఈడీ, సీబీఐలను ప్రయోగించి ఎన్నికల్లో గెలవాలని చూస్తే అత్యంత చైతన్యవంతమైన ప్రజలు ఉన్న తెలంగాణలో ఇది సాధ్యం కాదన్నారు. కవిత వ్యాఖ్యలపై స్పందించిన బక్కజడ్సన్ కల్వకుంట్ల కవిత అవినీతి చేసిందని, మద్యం కుంభకోణంలో ఆమె పేరును సీబీఐ ప్రస్తావించిందని అన్నారు.

అయితే ఈ ఇష్యులో కవిత తెలంగాణ సెంటిమెంట్‌ను తీసుకురావడం సరికాదన్నారు. మోడీ కంటే ముందు ఈడీ వస్తుందని కవిత చెబుతున్నారని ఈ కేసులో కవిత పేరు బయటకు రావడం వెనుక తెలంగాణ ప్రజలు పాపం చేసినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. మరో సారి ఎమోషన్స్ క్రియేట్ చేయాలనుకోవడం సబబు కాదన్నారు. ఈడీ వచ్చింది కవిత కోసం మాత్రమేనని తెలంగాణ ప్రజల కోసం కాదన్నారు. కవిత పేరు లిక్కర్ స్కాంలో ఉన్నదని, ఆమె అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్నదని ఆరోపించారు. కవిత కోసం మాత్రమే దర్యాప్తు సంస్థలు వస్తుంటే అదే తెలంగాణ ప్రజల కోసం వస్తున్నట్టుగా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. కల్వకుంట్ల కవిత తెలంగాణ శశికళగా, అవినీతి రాణిగా అభివర్ణించాడు. లిక్కర్ స్కాంలో కవిత జైలుకు పోవాలన్నారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతిని తెలంగాణ ప్రజలకు ఆపాదించాలనే ప్రయత్నం మానుకోవాలని అన్నారు. 

Tags:    

Similar News