ఆ నిజాలు బయటపడతాయనే సోమేష్ కుమార్‌కు కొత్త పదవి: బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు
మాజీ సీఎస్ సోమేష్‌కుమార్ బ్లాక్ మెయిల్ చేస్తూ తెలంగాణలో రీ ఎంట్రీ ఇచ్చారని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ సీఎస్ సోమేష్‌కుమార్ బ్లాక్ మెయిల్ చేస్తూ తెలంగాణలో రీ ఎంట్రీ ఇచ్చారని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. కేసీఆర్‌ను భయపెట్టి కొత్త కొలువు పొందాడని స్పష్టం చేశారు. అక్రమ ఆస్తులు, తప్పుడు విధానాలన్నీ సోమేష్ద్వారా బయటకు వెళ్తాయనే భయంతోనే కేసీఆర్ ఈ కొత్త పదవిని ఇచ్చారని మంగళవారం జడ్సన్ ఓ వీడియా రిలీజ్చేశారు. ధరణి పేరుతో భూములు దోచుకోవడం, పేదలకు ఇబ్బందులు కల్గించడం వంటివన్నీ సోమేష్ఆలోచనలే అన్నారు. మళ్లీ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు మాజీ సీఎస్వచ్చాడన్నారు. అసలు ఇప్పుడు అంత అర్జెంట్‌గా ఆయన్ని నియమించాల్సిన అవసరం ఏమున్నదని జడ్సన్ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదవీ విరమరణ పొందినోళ్లకు కొత్త పోస్టులు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంచాయితీ కార్యదర్శలను సతాయిస్తూ మాజీ సీఎస్‌కు పెద్దపీఠ వేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉన్నదన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని గతంలోనే ఓ ప్రతిపాదన పెట్టామని, కానీ ఇప్పటి వరకు అ విధానం అమల్లోకి రాలేదన్నారు. కేసీఆర్, సోమేష్‌లు కలసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. అక్రమ సంపాదనలపై ఈడీ, సీబీఐ ఎంక్వైరీ చేయాలన్నారు. పాలన దిక్కులేని స్థితిలో ఉన్నదన్నారు. దీంతో ప్రజాసంఘాలు, విద్యార్ధులు, ప్రతిపక్ష పార్టీలన్నీ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు.