Attack on Hindu Temples: హిందూ దేవాలయాలపై ఆగని దాడులు.. అమ్మవారి కళ్లు, వస్త్రాలు తొలగించిన దుండగులు

తెలంగాణలో హిందూ దేవాలయాలపై వరుస దాడుల ఘటనలు కలకలం రేపుతున్నాయి.

Update: 2024-11-10 04:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో హిందూ దేవాలయాలపై వరుస దాడుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే శంషాబాద్‌లోని ఆంజనేయ ఆలయంలో నవగ్రహలను ధ్వంసం చేసిన ఘటన దుమారం రేపగా.. తాజాగా.. శనివారం రాత్రి శంషాబాద్ మండలం జూకల్ గ్రామంలో మరో దేవాలయంపై దుండగులు దాడి జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జూకల్ గ్రామంలో 10మంది గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోని చౌడమ్మ, పోచమ్మ ఆలయంపై దాడి చేయడమే కాకుండా గర్భగుడిలోని అమ్మవారి విగ్రహానికి ఉన్న వస్త్రాలు, కళ్లు తొలగించారు. రాత్రి వేళ కావడంతో ఈ విషయాన్ని గ్రామస్థులు గుర్తించలేకపోయారు. అయితే చివర్లో ఆలయంలో నుంచి వస్తున్న నిందితులను గమనించిన గ్రామస్థులు ఒకడిని పట్టుకున్నారు. కానీ 9మంది పరార్ అయ్యారు. ఇక ఆలయంలో జరిగిన ధ్వంసాన్ని గమనించిన గ్రామస్థులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News