హరీష్ రావు కార్యాలయంపై దాడి.. తీవ్రంగా ఖండించిన కేటీఆర్
శనివారం రాత్రి కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి హరీశ్ రావు రాజీనామాకు డిమాండ్ చేస్తూ.. సిద్దిపేటలో నిరసన చేపట్టారు.
దిశ, వెబ్ డెస్క్: శనివారం రాత్రి కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి హరీశ్ రావు రాజీనామాకు డిమాండ్ చేస్తూ.. సిద్దిపేటలో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై, ఇంటి పై దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ సిద్దిపేట ఘటనను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు ఆయన.. తన ట్వీట్‌లో " హరీష్‌రావు ఇంటిపై దాడి పిరికిపందల చర్య, గత పదేళ్లు రాజకీయ హింసకు తెలంగాణ దూరంగా ఉంది. కాంగ్రెస్ హయాంలో హింసను ప్రేరేపిస్తున్నారు. సరైన సమయంలో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు.