Assembly: ఫాక్స్‌కాన్ ఎక్కడికి పోలేదు, దుష్ప్రచారాలు వద్దు.. మంత్రి శ్రీధర్ బాబు
ఫాక్స్‌కాన్(Foxconn) సంస్థ ఎక్కడికీ పోలేదని, ప్రతిపక్షాలు(Opposition) దుష్ప్రచారాలు(False Propaganda) చేయవద్దని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు(IT Minister Sridhar Babu) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: ఫాక్స్‌కాన్(Foxconn) సంస్థ ఎక్కడికీ పోలేదని, ప్రతిపక్షాలు(Opposition) దుష్ప్రచారాలు(False Propaganda) చేయవద్దని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు(IT Minister Sridhar Babu) అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Session) జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పాక్స్‌కాన్ సంస్థపై తప్పుడు ప్రచారాలు చేయోద్దని, ఆ సంస్థ ఎక్కడికి పోలేదని ఇక్కడే ఉందని స్పష్టం చేశారు. అలాగే ఫాక్స్‌కాన్ అనేది పెద్ద సంస్థ అని, దాని బేస్ బెంగళూరులో ఉందని, దాని ద్వారా ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టబోతోందని చెప్పారు. అంతేగాక భవిష్యత్తులో తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నారని, అతి త్వరలో దాని గురించి ప్రకటన చేయబోతున్నామని మంత్రి అన్నారు. అలాగే ప్రతిపక్షాలు రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని కోరుకోవాలని, సంస్థలు పోతున్నాయని దుష్ప్రచారాలు చేసి, భయబ్రాంతులు సృష్టించి కొత్త సంస్థలు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇక తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రప్రగతికి దోహదపడతామని శ్రీధర్ బాబు తెలిపారు.