Vivek: బీజేపీలోనే ఉండి ఉంటే కేంద్రమంత్రి అయ్యేవాడిని.. అయినా వదులుకొని కాంగ్రెస్‌లోకి వచ్చా

మంత్రి పదవిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(Premsagar Rao) చేసిన వాఖ్యలకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి(Vivek Venkatswamy) కౌంటర్ ఇచ్చారు.

Update: 2025-04-14 14:06 GMT
Vivek: బీజేపీలోనే ఉండి ఉంటే కేంద్రమంత్రి అయ్యేవాడిని.. అయినా వదులుకొని కాంగ్రెస్‌లోకి వచ్చా
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి పదవిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(Premsagar Rao) చేసిన వాఖ్యలకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి(Vivek Venkatswamy) కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా కుటుంబంపై పరోక్షంగా విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కాకా కుటుంబం(Kaka's Family) అంటేనే సేవ చేసే కుటుంబం అని చెప్పారు. గత ఎన్నికల్లో కాకా కుటుంబం ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తన ఇంటికొచ్చి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తేనే కాంగ్రెస్ పార్టీలో చేరాను. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఇప్పటివరకు కాకా కుటుంబం నుంచే ఎంపీలుగా గెలిచి సత్తా చాటామని అన్నారు.

‘దమ్ము ధైర్యం ఉంటే నాపై పోటీ చేసి గెలవాలని అహంకారంతో బాల్క సుమన్ సవాల్ చేశాడు. సవాళ్లను స్వీకరించి కేవలం 22 రోజుల ప్రచారం చేసి బాల్క సుమన్‌ను చిత్తుగా ఓడించాను. బీజేపీ(Telangana BJP)లో కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉన్న కూడా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. కొందరు పోలీసులను అడ్డుపెట్టుకొని బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అలాంటి రాజకీయాలు అంటే నాకు అసహ్యం. నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. నేను వచ్చాక చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక, బియ్యం దందాలకు అడ్డుకట్ట వేశాను. నాయకులు మంచి పనులు చేస్తేనే ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపే ఎన్నికల్లో గెలుపుకు నాంది అవుతుంది’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి అన్నారు.

Tags:    

Similar News