అందరికీ ఒకటే రూల్.. హైదరాబాద్‌లో టైమ్ రిస్ట్రిక్షన్స్‌పై అసదుద్దీన్ సంచలన ట్వీట్

హైదరాబాద్‌లో రాత్రి 11 దాటిన తర్వాత షాపులు తెరిచి ఉంచితే ఫ్రెండ్లీ పోలీసు ఉండదని.. ఓన్లీ లాఠీ ఛార్జ్ పోలీసు ఉంటుందని ఖాకీలు చేసిన అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Update: 2024-06-24 14:26 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో రాత్రి 11 దాటిన తర్వాత షాపులు తెరిచి ఉంచితే ఫ్రెండ్లీ పోలీసు ఉండదని.. ఓన్లీ లాఠీ ఛార్జ్ పోలీసు ఉంటుందని ఖాకీలు పాతబస్తీలో చేసిన అనౌన్స్‌మెంట్ సంచలనంగా మారింది. ఈ వీడియోపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ డీజీపీ, సీపీ హైదరాబాద్ సిటీకి ట్వీట్ ట్యాగ్ చేసిన అసదుద్దీన్ జూబ్లీహిల్స్‌లో ఇలాంటి అనౌన్స్‌మెంట్ చేయగలరా అని ప్రశ్నించారు. ఇరానీ ఛాయ్ హోటళ్లు, పాన్ షాపులు, లేదా కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ను కనీసం రాత్రి 12 గంటల వరకు తెరుచుకునేలా అనుమతి ఇవ్వాలని కోరారు. అందరికీ ఒకటే రూల్ ఉండాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా పెద్ద మెట్రో నగరాల్లో షాపులను రాత్రి వేళ తెరవడానికి అనుమతి ఇస్తాయని.. హైదరాబాద్‌లో ఎందుకు భిన్నంగా ఉందని ప్రశ్నించారు. అసలే దేశంలో ఆర్థిక మాంద్యం ఉంది కదా అని తెలిపారు.       


Similar News