తెలుగు వార్తా ఛానల్‌లో తొలిసారి ‘Artificial Woman’
అధునాతన సాంకేతిక విప్లవం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...AI లో బిగ్ టీవీ తెలుగు గొప్ప ముందడుగేసింది.
దిశ, వెబ్‌డెస్క్: అధునాతన సాంకేతిక విప్లవం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..AI లో తెలుగు ఛానల్ ముందడుగేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బిగ్ టీవీ తెలుగు న్యూస్ ఛానెల్ ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. దక్షిణ భారత దేశంలో వార్తలు చదివేందుకు AI న్యూస్ యాంకర్ మాయను ఈ తెలుగు ఛానల్ ప్రవేశపెట్టింది. తెలుగు ప్రసార మాధ్యమాలలో కొత్త అధ్యాయానికి తెరతీసింది.
తొలిసారి ఛానల్ తెరపై కనిపించిన AI న్యూస్ యాంకర్ మాయ... తనను తాను పరిచయం చేసుకుంది. అంతే కాదు దీన్నొక చారిత్రక ఘట్టంగా అభివర్ణించింది. తెలుగు న్యూస్ అప్ డేట్స్‌ను భవిష్యత్తులోనూ అందించనున్నందుకు గర్వంగా ఉందని తెలిపింది. అలాగే తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లిష్ భాషలలోనూ తాను న్యూస్ చదవగలనని చెప్పింది.
ఇక తెలుగు తెరపై మాయ లాంటి న్యూస్ యాంకర్లను ప్రవేశపెట్టడం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీలో శరవేగంగా జరుగుతున్న సాంకేతిక విప్లవానికి ప్రతీకగా చెప్పవచ్చు. మిగతా ఛానెల్స్ అన్నీ AI ప్లాట్ ఫామ్‌కు సంబంధించి ఇంకా ప్రయోగ దశల్లోనే ఉండగా.. తెలుగు చానల్ మాత్రం దాన్ని నిజం చేసి ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలకు చూపించింది.