Armoor మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీతకు పదవీ గండం..?
ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీతకు పదవీ గండం తలెత్తినట్లుగా తెలుస్తుంది.
దిశ ఆర్మూర్: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీతకు పదవీ గండం తలెత్తినట్లుగా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్ల తీరును వారి చర్యలను బట్టి తెలుస్తుంది. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత, ఆమె భర్త పండిత్ పవన్, ఆమె మరిది పండిత్ ప్రేమ్‌ల ఏకపక్ష నిర్ణయాలు, మున్సిపల్‌లో ఇష్టా రీతిన నిధుల కేటాయింపుపై ఆర్మూర్ మున్సిపల్‌లో అధికార పార్టీకి చెందిన బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ అధిష్టానికి ఫిర్యాదు చేసేందుకు కూటమి కట్టారు.
శుక్రవారం ఆర్మూర్ మున్సిపల్‌లోని 26 మందితో మున్సిపల్ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్ల భర్తలు ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ తరలి వెళ్లారు. ఆర్మూర్ మున్సిపల్‌లో మున్సిపల్ చైర్ పర్సన్ పండిట్ వినీత, ఆమె భర్త పండిత్ పవన్, ఆమె మరిది పండిత్ ప్రేమ్‌లు సాగిస్తున్న ముక్కోణపు నిర్ణయాలపై అధికార పార్టీ కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తితో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి దగ్గరకు వెళ్లి వారు చేస్తున్న చర్యల గురించి క్షుణ్ణంగా ఫిర్యాదు చేసి మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీతను ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా మార్చాలని 26 మంది ముక్త కంఠంతో జీవన్ రెడ్డికి చెప్పేందుకు వెళ్లారు.
చైర్ పర్సన్ వినీత, ఆమె భర్త, మరిదిల వైఖరికి నిరసనగా మున్సిపల్ కౌన్సిలర్లు అంతా హైదరాబాద్ తరలివెళ్లి తప్పకుండా ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్‌ను తొలగించాలని ఎమ్మెల్యేని కోరేందుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కౌన్సిలర్ల ఫిర్యాదు పట్ల ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఆర్మూర్ పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి వేరే సామాజిక వర్గానికి , గతంలో చైర్ పర్సన్‌గా చేస్తానని హామీ ఇచ్చిన నేతల్లో చైర్ పర్సన్ పదవి దక్కుతుందేమోనని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు..
Also Read...