Arikepudi Gandhi: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఓ బ్రోకర్.. అరికెపూడి సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సవాలుతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Update: 2024-09-12 05:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సవాలుతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ (Arikepudi Gandhi) ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ మేరకు ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్న అరికెపూడి గాంధీ తెలంగాణ భవన్‌కు రావాలని నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి (Koushik Reddy) డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)కు రాకపోతే తాను అరికెపూడి ఇంటికి వెళ్లి బీఆర్‌ఎస్ కండువా కప్పుతామని కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై అరికెపూడి గాంధీ ఘాటు స్పందించారు. కౌశిక్‌రెడ్డి సరిగ్గా 11 గంటలకు తన ఇంటికి వస్తానని అన్నాడు.. ఒకవేళ రాకపోతే 12 గంటలకు ఆయనే కౌశిక్ ఇంటికి వెళ్తానని కౌంటర్ ఇచ్చాడు.

అదేవిధంగా తన ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు అవసరం లేదన్నాడు. ఎవరిలో ఎంత దమ్ముందో తేల్చుకుందాం రా.. అంటూ సవాల్ చేశారు. కౌశిక్‌రెడ్డి పక్కా బ్రోకర్ అంటూ కామెంట్ చేశారు. తాను ఓ సీనియర్ శానస సభ్యుడిని అని, ఆయన పార్టీలోకి వచ్చి ఎన్నాళ్లయిందో చెప్పాలన్నారు. తన గురించి మాట్లాడే అర్హత కౌశిక్‌రెడ్డికి లేదన్నారు. కేసీఆర్‌ (KCR)కు, తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయన పట్ల తనకు ఎల్లప్పుడూ గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి లాంటి బ్రోకర్ల వల్ల పార్టీకి చాలా మంది దూరం అయ్యారని ఆరోపించారు.

కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తాజగా కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్‌ (Telangana Politics) లో హాట్‌టాపిక్‌గా మారాయి. పార్టీ మారిన 10 మందికి చీరలు, గాజులు కొరియర్‌ చేస్తామని కౌశిక్‌రెడ్డి కామెంట్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్‌ (Tellam Venkat Rao), అరికెపూడి గాంధీ, కాంగ్రెస్‌ మహిళా నేతలు తీవ్రంగా స్పందించారు.  


Similar News