బ్రేకింగ్: రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. ఆ స్థానంలో ఓటమి తప్పదన్న ఆరామస్తాన్ సర్వే..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. తెలంగాణలో ఈ సారి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెల్చి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. తెలంగాణలో ఈ సారి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెల్చి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ తమ సర్వే ఫలితాలు వెల్లడించాయి. అయితే, ఆరామస్తాన్ సర్వే సంస్థ తెలంగాణలో హాట్ సీటుగా మారిన కామారెడ్డిపై షాకింగ్ రిజల్ట్ ఇచ్చింది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీకి దిగిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇక్కడ ఓడిపోతాడని తెలిపింది. కాగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన సొంత ఇలాకా అయిన కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అలాగే కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌కు సైతం ఓటమి తప్పదని.. ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెంటకరమణారెడ్డి గెలిచే అవకాశం ఉందని సర్వేలో తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో ఆరామస్తాన్ ఎగ్జిట్స్ పోల్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
Read More..
బ్రేకింగ్: ఆ స్థానంలో KCR ఓటమి..! ఆరామస్తాన్ ఎగ్జిట్స్ పోల్స్‌లో షాకింగ్ రిజల్ట్
ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు.. BRS గెలిచే సీట్ల సంఖ్య తేల్చిచెప్పిన KTR