మరో 4 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు పాలకవర్గం నియామకం

రాష్ట్రంలో మరో నాలుగు అగ్రికల్చర్ మార్కెట్లకు నూతన పాలకవర్గాన్ని నియమించారు.

Update: 2024-09-11 15:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మరో నాలుగు అగ్రికల్చర్ మార్కెట్లకు నూతన పాలకవర్గాన్ని నియమించారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్, నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, హన్మకొండ జిల్లాలోని పరకాల, యాదాద్రి జిల్లాలోని ఆలేరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్మన్‌లను, వైస్ చైర్మన్లతో పాటు నూతన పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జైనాథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అల్లూరి అశోక్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా సవపూరె విలాస్, అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా అంతటి రజిత, వైస్ చైర్మన్ గా రసుమొల్ల వెంకటయ్య, పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ గా చందుపట్ల రాజిరెడ్డి, వైస్ చైర్మన్ గా మరపల్లి రవీందర్, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఇనాల చైతన్య, వైస్ చైర్మన్ గా పచిమట్ల మధర్ గౌడ్ ను నియమించారు. వీటితో కలిపి మొత్తం 48 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన మార్కెట్ కమిటీలకు కూడా కొత్త మార్కెట్ కమిటీలను నియమిస్తామని వెల్లడించారు. నిబద్ధతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు.


Similar News