కేటీఆర్‌కు ఏపీ మంత్రి అమర్ నాథ్ కౌంటర్

కేటీఆర్‌కు ఏపీ మంత్రి అమర్ నాథ్ కౌంటర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2023-04-11 08:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్‌కు ఏపీ మంత్రి అమర్ నాథ్ కౌంటర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటూనే బిడ్డింగ్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని కేటీఆర్ అంటున్నారన్నారు. ప్రైవేటీకరణగా వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం పోరాడుతూనే ఉందన్నారు. ఈ విషయంపై అనేక సార్లు చర్చించామన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్వహణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించలేమంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా భరించగలవన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేటీఆర్ క్లారిటీగా మాట్లాడాలని అన్నారు. 

Tags:    

Similar News