తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఏపీ సీఎం గుడ్ న్యూస్.. తిరుమలలో వారానికి నాలుగు సార్లు దర్శనం

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్తను అందించాడు.

Update: 2024-12-30 10:57 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) నాయుడు శుభవార్తను అందించాడు. రెండు రోజుల క్రితం.. తిరుమల తిరుపతి తీసుకున్న నిర్ణయానికి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్(Green signal) ఇచ్చాడు. టీటీడీ బోర్డు(TTD Board) తిరుమలలో తెలంగాణకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వారంలో రెండు రోజుల పాటు.. తెలంగాణ ప్రజాప్రతినిధుల(Telangana public representatives) లేఖలపై తిరుమల దర్శనం(Darshan of Tirumala) ఇవ్వాలని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు సుముఖత చూపడంతో పాటు పలు ఫైలుపై సంతకం చేశారు. దీంతో వచ్చే కొత్త సంవత్సరం నుంచి తిరుమలలో.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలపై వారానికి నాలుగు సార్లు దర్శించుకోవచ్చు.

ఇందులో వారానికి రెండుసార్లు బ్రేక్ దర్శనం, అలాగే మరో రెండు సార్లు రూ.300 దర్శనాలు చేసుకునేందుకు టీటీడీ(TTD) వీలు కల్పించింది. అయితే గతంలో 2019 కి ముందు.. తిరుమలలో అన్ని ప్రాంతాల వారి లేఖలను పరిగణలోకి తీసుకుని దర్శనాలకు అనుమతి ఇచ్చేవారు. కానీ 2019 తర్వాత వైసీపీ అధికారం ఉన్న కాలంలో 2024 వరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించ లేదు. దీంతో సౌత్ ఇండియాలో అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల(Tirumala)లో తెలంగాణ ప్రాంతంపై వివక్ష చూపడం సరికాదని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో కొత్తగా టీటీడీ చైర్మన్ బాధ్యతలు తీసుకున్న బీఆర్ నాయుడు(BR Naidu) తెలంగాణ ప్రజాప్రతినిధుల(Telangana public representatives) అసహనంపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.


Similar News