అమెరికాలో మరో కొత్త తెలుగు అసోసియేషన్.. పేరు ఇదే
అమెరికాలో మరో కొత్త తెలుగు అసోసియేషన్ ఏర్పాటైంది. మన అమెరికా తెలుగు అసోసియేషన్(మాట) పేరుతో కొత్త సంఘం ఆవిర్భవించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: అమెరికాలో మరో కొత్త తెలుగు అసోసియేషన్ ఏర్పాటైంది. మన అమెరికా తెలుగు అసోసియేషన్(మాట) పేరుతో కొత్త సంఘం ఆవిర్భవించింది. శుక్రవారం న్యూయార్క్‌లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘాన్ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు 2500 మంది తెలుగు ప్రజలు పాల్గొన్నారు. మాట వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల మాట్లాడారు. ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగు ప్రజల కోసం సేవా, సంస్కృతి, సమానత్వం మూడు సూత్రాలతో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్(మాట) సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మహిళా సాధికరతకు ప్రాధాన్యమిస్తూ, యువతను ప్రోత్సహిస్తామనీ తెలిపారు.
న్యూయార్క్, చికాగో, న్యూజెర్సీ, గ్రేటర్ ఫిల్లీ, అల్బానీ, మేరీల్యాండ్, వర్జీనియా, టంపా, డల్లాస్ తదితర దాదాపు 20 నగరాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారనీ వెల్లడించారు. ఓహియో, సెయింట్ లూయిస్, లాస్ ఎంజిల్స్, సీఏ, సీటెల్ నుంచి 2వేల మంది జీవిత సభ్యులుగా నమోదయ్యారనీ నేతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖసింగర్లు సునీత, అనిరుధ్ తమ పాటలు,సంగీతంతో అలరించారు. స్వాతి అట్లూరి తన 70మంది బృందంతో నృత్యం ప్రదర్శించారు. కార్యక్రమంలో మాట కోర్ టీమ్ సభ్యులు శ్రీ అట్లూరి, శ్రీధర్ చిల్లర, దాము గేదెల, జితేందర్ రెడ్డి, డాక్ర్ స్టానెలీ రెడ్డి, పవన్ దరిసి, ప్రసాద్ కూనిశెట్టి, శేఖర్ రెడ్డి కోనాల, స్వాతి అట్లూరి, కిరణ్ దుద్దగి,ప్రవీణ్ గూడూరు, మహేందర్ నరాల, శ్రీనివాస్ కనకం, లక్ష్మీ మోపర్తి, కృష్ణ సిద్ధాడ, గోపి వూట్కూరి, రఘు మోడుపోజు, వేణు గోపాల్ గిరి, వెంకీ మస్తీ, అంజన్ కర్నాటి, గిరి కంభంమెట్టు, రఘురాం రెండుచింతల, గిరిజా మాదాసి, బాబురావు సామల, రాజ్ ఆనందేసి, టోనీ జన్ను, సత్య నేమన తదితరులు పాల్గొన్నారు.