కేసీఆర్..కేటీఆర్ సారధ్యంలో మరో ఉద్యమం : మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి

బతుకమ్మ ఉత్సవాలను నిర్లక్ష్యం చేసి తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విషం కక్కుతుంటే బీఆర్ఎస్ చూస్తు ఊరుకోదని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.

Update: 2024-10-11 08:02 GMT

దిశ, వెబ్ డెస్క్ : బతుకమ్మ ఉత్సవాలను నిర్లక్ష్యం చేసి తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విషం కక్కుతుంటే బీఆర్ఎస్ చూస్తు ఊరుకోదని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బతుకమ్మ పండగ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేన నిధులివ్వకపోగా, డీజేలను నిషేధించి మహిళలు బతుకమ్మ ఆడుకోకుండా చేశారన్నారు. ఉద్యమాలు, పోరాటాలతో నిర్మాణమైన పాటలనే ఆపాలని చూస్తే ప్రజలు ఊరుకోరని, సోషల్ మీడియాను, యూట్యూబ్ ఛానల్స్ ని దాడులతో, కేసులతో ఆపగలవేమో గాని ఉద్యమాలని ఆపలేరని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.

మహిళలు ఇష్టపడే బతుకమ్మ పాటలు అంటేనే రేవంత్ రెడ్డి ఒంట్లో వణుకు పుడుతుందన్నారు. తెలంగాణ బతుకమ్మ పాటలంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు భయమైతుందని ప్రశ్నించారు. మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాష్ట్రం కలతప్పిందని, కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని, కేసీఆర్ బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించాడని, ప్రతి ఏటా ప్రత్యేక నిధులు కేటాయించి.. ఎంత సంబురంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నామని మహిళలు గుర్తు చేసుకున్నారన్నారు.

కేసీఆర్ కు ఎప్పుడు ఎలా ప్రజల్లోకి రావాలో తెలుసని, మొన్న వరదలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ మొత్తం కదిలి వచ్చి బాధితులకు బాసటగా నిలిచిందన్నారు. ఏమనుకుని తెచ్చుకున్న తెలంగాణ.. ఎట్ల మారుస్తుండ్రని, చూస్తూ ఉరుకుందామా ఏం చేసినా బరిద్దామా అని ప్రశ్శించారు. కోట్లాడి ప్రత్యేక రాష్టాన్నే సాధించుకునోళ్లమని, మన సంప్రదాయాలను, మన సంసృతిని రూపుమాపాలని చూస్తే ఊరుకుంటామా అని మండిపడ్డారు. పోలీసులను స్వార్ధాలకు వాడుకున్న ప్రభుత్వాలెప్పుడు నిలబడ్డ చరిత్ర లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై పోరాడుతామని, కేసీఆర్, కేటిఆర్ సారథ్యంలో మరో ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు. బతుకమ్మ ఉత్సవాల నిర్వహణలో తప్పు ఒప్పుకుని తెలంగాణ అడపడుచులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. 


Similar News