TSPSC లీకేజీ కేసులో మరో కీలక పరిణామం

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2023-04-11 04:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలాలు తీసుకోవాలని ఈడీ డిసైడ్ అయింది. వాంగ్మూలాల నమోదుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. ప్రశ్నాపత్రాల లీక్ కోసం భారీగా నగదు చేతులు మారినట్లు ఈడీ అనుమానిస్తోంది. మనీ లాండరింగ్ పెద్ద మొత్తంలో జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.

సిట్ అధికారులు సాక్షిగా పేర్కొన్న శంకరలక్ష్మీ పై ఈడీ ఫోకస్ చేసింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మీ కంప్యూటర్ నుంచే ప్రశ్నాపత్రం లీక్ అవ్వగా.. శంకరలక్ష్మీతో పాటు కమిషన్ కు చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను కస్టడీకి తీసుకుని ఈడీ విచారించనుంది. 

Tags:    

Similar News