తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మరో కీలక నిర్ణయం తీసుకున్నది.

Update: 2025-03-25 11:13 GMT
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ట్యాంక్‌బండ్ పీపుల్స్ ప్లాజాలో నెల‌కొల్పిన నీరా కేఫ్‌(Neera Cafe)ను క‌ల్లుగీత పారిశ్రామిక కార్పొరేష‌న్‌(Kallugeeta Corporation)కు అప్పగించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి, మంత్రి పొన్నం ప్రభాక‌ర్‌‌తో పాటు సహకరించిన ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్‌కు క‌ల్లుగీత విభాగం అధ్యక్షులు నాగ‌రాజు గౌడ్‌ ధ‌న్యవాదాలు తెలిపారు.

ఇదిలా ఉండగా.. ప్రభుత్వం ఎక్సైజ్‌, పర్యాటకశాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాత నీరా కేఫ్‌ను పర్యాటకశాఖ నుంచి తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు బదిలీ చేసింది. ఆ భూమి టూరిజం శాఖది కావడంతో నీరాకేఫ్‌ నుంచి వచ్చే ఆదాయంలో 30శాతం టూరిజంశాఖకు చెల్లించాలని పేర్కొంది. బీసీ సంక్షేమశాఖ, పర్యాటకశాఖ, రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్‌ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.

Tags:    

Similar News