తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆ 51 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేసింది.

Update: 2024-09-03 13:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేసింది. ఈ మేరకు మంగళవారం గెజిట్ విడుదల చేసింది. కేబినెట్‌ సబ్ కమిటీ సిఫార్సులతో ఈ నిర్ణయం తీసుకున్నది. తక్షణమే గెజిట్ అమల్లోకి వస్తుందని విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో మేడ్చల్ మున్సిపాలిటీలోకి, దమ్మాయిగూడ మున్సిపాలిటీలోకి, పోచారం మున్సిపాలిటీలోకి, ఘట్కేసర్ మున్సిపాలిటీలోకి, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోకి, అమీన్‌పూర్ మున్సిపాలిటీలోకి, తెల్లాపూర్ మున్సిపాలిటీలోకి 51 గ్రామాలు విలీనం కానున్నాయి. దీంతో ఇప్పటివరకు పంచాయతీ అధికారుల చేతుల్లో ఉన్న రికార్డులు ఇక మున్సిపల్ అధికారుల చేతుల్లోకి వెళ్లనున్నాయి.


Similar News