వివాదంలో అజారుద్దీన్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై మరో కేసు

వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై మరో కేసు నమోదైంది. తన పదవీకాలం ముగిసినప్పటికీ తప్పుడు డాక్యూమెంట్స్‌ను క్రియేట్

Update: 2022-10-10 08:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై మరో కేసు నమోదైంది. తన పదవీకాలం ముగిసినప్పటికీ తప్పుడు డాక్యూమెంట్స్‌ను క్రియేట్ చేసి బీసీసీఐ, ఈసీ కమిటీని తప్పుదోవ పట్టించే విధంగా హెచ్‌సీఏ అధ్యక్షుడి అజారుద్దీన్ వ్యవహరిచారని హెచ్‌‌సీఏ మాజీ అధ్యక్షుడు జి.వినోద్, సెక్రటరీ శేషు నారాయణ్, హెచ్‌సీఏ మెంబర్ చిట్టి శ్రీధర్ బాబు రాచకొండ సీపీకి సోమవారం ఫిర్యాదు చేశారు. గత సెప్టెంబర్ 26తోనే అజారుద్దీన్ పదవికి గడువు ముగిసిందని పదవి కాలంపై ఎవరిని సంప్రదించకుండా ఆయనకు ఆయనే గడువు పొడిగించుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 18న బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్‌కు హాజరు అయ్యేందుకు అజారుద్దీన్ తన పదవి సమయాన్ని పొడిగించుకున్నట్లు కంప్లైంట్‌లో ఆరోపించారు. దీనిపై క్రిమినల్ కేసు కింద ఐపీసీ ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలంటూ హెచ్‌సీఏ మాజీ ప్రతినిధులు రాచకొండ సీపీ మహేష్ భగవత్‌ను కోరారు.

Tags:    

Similar News