బ్రేకింగ్ న్యూస్.. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేజీలకు నోటీసులు
గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి సంబంధించిన పలు కాలేజీలు, నూతన నిర్మాణల ఇష్యూ రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి సంబంధించిన పలు కాలేజీలు, నూతన నిర్మాణల ఇష్యూ రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం నగరంలో హైడ్రా దూకుడు నేపధ్యంలో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. దుండిగల్ లోని MLRIT, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో ఎమ్మెల్యేకు చెందిన కాలేజీలు.. చిన్నదామర చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో చేపట్టారని.. వెంటనే ఆ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో దూకుడు మీద ఉన్న హైడ్రా.. త్వరలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలను కూల్చివేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.