KTRకు మరో బిగ్ షాక్! అక్రమాల చిట్టా విడుదల

ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది.

Update: 2023-11-28 05:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి కేటీఆర్ అక్రమాలపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ‘రామ్ రామ్ రావు రావు’ అనే ఛార్జ్ షీట్‌ను మంగళవారం మీడియా ఎదుట రాణి రుద్రమ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేరెళ్ల దళితులను చావగొట్టిన ద్రోహి కేటీఆర్ అన్నారు. కేటీఆర్ చిన్నమ్మ కొడుకు, ఎంపీ సంతోష్ వారి ముఠా కలిసి 15 లారీలకు ఒకటే నెంబర్ పెట్టి రాత్రంతా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. అడ్డొచ్చిన వారిని లారీలతో గుద్దారని ఆరోపించారు. ఇప్పటికీ బాధితులే జైళ్ల చుట్టూ తిరుగుతున్నారన్నారు.

కేటీఆర్ చేతిలో ఉన్న 8 మంది దళారులు, బ్రోకర్లు బతుకమ్మ చీరల టెండర్లను తమ చేతుల్లోకి తీసుకున్నారన్నారు. అసలైన చేనేత కార్మికులకు బతుకమ్మ చీరలతో లబ్ధి చేకూరడం లేదన్నారు. సిరిసిల్లను కేటీఆర్ ఎంచుకోవడానికి కారణం ప్రజల మీద ప్రేమ కాదన్నారు. స్థానికంగా ఉన్న వేల కోట్ల విలువైన ఇసుక మొత్తాన్ని అక్రమంగా తోడుకుపోయారని ఆరోపించారు.

సెస్‌లో రూ.30 కోట్ల కుంభకోణం జరిగిందని అక్రమ దందా చేసిన వారే ప్రస్తుతం సెస్‌లో కీలక పదవుల్లో ఉన్నారన్నారు. మండలానికి ఒక చిన్న దొరను తమ సామాజిక వర్గానికి చెందిన వారిని అపాయింట్ చేసి సంపదను కేటీఆర్ కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఒక్క వానకు సిరిసిల్ల కలెక్టరేట్ మునిగిపోయిందని.. చెరువు కబ్జా చేసి కలెక్టరేట్ కట్టారని ఫైర్ అయ్యారు. అక్వా హబ్ పేరిట స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రామారావు మోసం చేశారన్నారు. ఇవన్నీ చేసినందుకు కేటీఆర్‌కు సిరిసిల్ల ప్రజలు ఓటేయ్యాలా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News