కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి సబితమ్మ!

కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగలనుందా?..

Update: 2024-06-30 08:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడప్ చేయడంతో ఎమ్మెల్యేల వలసల పర్వం ఇప్పటి వరకు ఆరుకు చేరింది. తాజాగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి సైతం పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌తో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, ఆషాడ మాసం ప్రారంభంలోనే ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల నియోజకవర్గ పర్యటనలో ఆమె మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘హోం శాఖ, విద్యాశాఖలను మీ కోసమే ఖాళీగా ఉంచారేమో మేడమ్.. మీరు వెళ్తే మీకే ఆ శాఖ ఇస్తారేమో..’ అని ఓ రిపోర్టర్ నవ్వుతూ వ్యాఖ్యానించగా మంత్రి పదవి కావాలంటే అదృష్టం ఉండాలని, నుదుటి రాత బాగాలేకుంటే ఏమీ చేయలేమని సరదాగా బదులిచ్చారు. అయితే బీఆర్ఎస్ అధికారంలో లేనందున మంత్రి పదవి సాధ్యం కాదని చెప్పకుండా అదృష్టం ఉండాలని వ్యాఖ్యానించడంతో త్వరలోనే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అనే చర్చ జరుగుతోంది.

కుమారుడికి కీలక పదవి!

గతంలో కాంగ్రెస్‌లో ఉన్న సబితాఇంద్రారెడ్డి హోం మంత్రిగా పనిచేశారు. 2019లో కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌‌లో చేరి మంత్రి పదవి కొట్టేశారు. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆమె పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరబోతున్నారని, అతడికి నామినేటెడ్ పోస్టును సైతం కాంగ్రెస్ ఆఫర్ చేసిందనే ప్రచారం జరుగుతోంది.

పట్నం, పట్లోళ్ల కాంబినేషన్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయల్లో పట్నం, పట్లోళ్ల ఫ్యామిలీలదే ఆధిపత్యం. ఏ పార్టీ పవర్‌లో ఉన్నా ఈ రెండు కుటుంబాల్లో ఎవరో ఒకరు అధికార పక్షంలో ఉండటం పక్కా. అయితే 2019 తర్వాత ఈ సీన్ మారింది. పట్నం మహేందర్‌రెడ్డి, పట్లోళ్ల సబిత ఈ ఇద్దరూ బీఆర్ఎస్‌లో చేరడంతో రెండు కుటుంబాలు అధికార పక్షంలో ఉన్నాయి. అయితే ఇటీవల పట్నం మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా తాజాగా సబితాఇంద్రారెడ్డి సైతం కాంగ్రెస్ వైపు చూస్తుండటంతో ఈ సారి పట్నం, పట్లోళ్ల కాంబినేషన్ కాంగ్రెస్‌లో ఉండబోతున్నదనే చర్చ సోషల్ మీడియలో వినిపిస్తోంది.


తెలంగాణ పాలిటిక్స్ లో మరో సంచనలం.. 

Tags:    

Similar News