టీఎస్పీఎస్సీ కేసులో మరొకరు అరెస్ట్

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : టీఎస్పీఎస్సి బోర్డు పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు మరో నిందితున్ని అరెస్ట్ చేసారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య నలభై అయుదుకు పెరిగింది. వరంగల్ జిల్లా విద్యుత్ శాఖలో

Update: 2023-05-28 11:38 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : టీఎస్పీఎస్సి బోర్డు పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు మరో నిందితున్ని అరెస్ట్ చేసారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య నలభై అయుదుకు పెరిగింది. వరంగల్ జిల్లా విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజనీర్ గా పని చేస్తున్న రమేష్ ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నా పత్రాలను ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన రవికిషోర్ నుంచి కొన్నట్టుగా సిట్ విచారణలో తేలింది. ఈ క్రమంలో రమేష్ ను సిట్ అధికారులు వరంగల్ లో అరెస్ట్ చేసారు. రమేష్ ను జరిపిన విచారణలో అతను ఈ ప్రశ్నా పత్రాలను మరో ఇరవై మందికి అమ్మినట్టుగా వెళ్లడయ్యింది. వీరి వివరాలను సేకరించిన సిట్ అధికారులు నిందితులను పట్టుకునేందుకు గాలింపును ముమ్మరం చేసారు.

Tags:    

Similar News