Humanity: చెత్తకుప్పలో ఆ పని చేస్తున్న యువకుడు..
మానవ సేవే మాధవ సేవ అని నమ్మారు. దైవం మానుష రూపేణా అనే మాటను నిజం చేశారు.
దిశ వెబ్ డెస్క్: మానవ సేవే మాధవ సేవ అని నమ్మారు. దైవం మానుష రూపేణా అనే మాటను నిజం చేశారు. అతనే అన్నం శ్రీనివాసరావు. ఖమ్మం జిల్లాలో అన్నం ఫౌండేషన్ పేరుతో సేవ సంస్థను స్థాపించి ఎందరో అనాధలకు ఆశ్రయం కల్పించారు.
దీనితో ఖమ్మంలో మతిస్థిమితం లేకుండా ఆకలితో రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులు ఎక్కడ కనిపించిన ఖమ్మంవాసులకు అన్నం ఫౌండేషన్ గుర్తుకు వస్తుంది. వెంటనే మతిస్థిమితం లేని వాళ్ళని ఆ ఫౌండేషన్ లో చేర్పిస్తారు.
ఇప్పటికే పలు రాష్ట్రాలకి సంబంధించిన 300 మంది అన్నం ఫౌండేషన్ లో ఆశ్రయం పొందుతున్నారు. తాజాగా మతిస్థిమితం లేని ఓ యువకుడిని అన్నం ఫౌండేషన్ చేరదీసింది.
నేలకొండపల్లి బైపాస్ దగ్గర గత ఆరునెలలుగా ఓ యువకుడు మతిస్థిమితం లేకుండా బైపాస్ బ్రిడ్జ్ కిందనే ఉంటున్నారు. ఆకలేస్తే చెత్త కుప్పల్లో వ్యర్ధాలను ఏరుకుని తింటున్నారు.
ఈ నేపథ్యంలో స్థానికులు అన్నం ఫౌండేషన్ కి సమాచారం అందించారు. ఇక స్థానికుల సమాచారం అందుకున్న అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస రావు యువకుడు ఉన్న ప్రదేశానికి చేరుకొని ఆ యువకుడిని అన్నం ఫౌండేషన్ కి తీసుకువెళ్లి చేరదీసారు.