బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ కొత్త డీజీపీ

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం పదవీ విరమణ చేశారు.

Update: 2022-12-31 05:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ అకాడమీలో మహేందర్ రెడ్డి రిటైర్మెంట్ ఉత్సవ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, వీఐపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీజీపీగా అత్యధిక కాలం పనిచేసిన ఆఫీసర్‌గా మహేందర్ రెడ్డి రికార్డు సృష్టించారు. ఐపీఎస్‌గా ఆయన 36 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సేవలు అందించారు. పోలీస్ శాఖలో సాంకేతికతతో కూడిన పలు విప్లవాత్మక మార్పులకు మహేందర్ రెడ్డి హయాంలో శ్రీకారం చుట్టారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఒక సభ్యుడిగా ఉంటూ అందరి ఆదరాభిమానాలు చూడగోరడానికి ప్రతిక్షణం పని చేశానని అన్నారు. నూతన రాష్ట్రంలో 8 ఏళ్ల పాటు పోలీస్ విభాగంలో పలు కీలక పదవులు నిర్వహించడానికి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇన్నాళ్లు విధి నిర్వహణలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

కొత్త బాస్ బాధ్యతల స్వీకరణ:

నూతన డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అంజనీ కుమారు గతంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, అవినీతి నిరోధక విభాగాధిపతిగా పని చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, లా అండ్ ఆర్డర్ అదరనపు డీజీగానూ ఆయన సేవలు అందించారు. డీజీపీగా మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేయడంతో ఇన్ చార్జి డీజీపీగా అంజనీ కుమార్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. మహేందర్ రెడ్డి రిటైర్మెంట్ సందర్భంగా నిర్వహించిన పరేడ్ సమావేశంలో అంజనీ కుమార్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహేందర్ రెడ్డితో కలిసి డిపార్ట్ మెంట్ లో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మహేందర్ రెడ్డి నాకు ఆదర్శనం అని, ఆయన లాంటి అధికారులు అరుదుగా ఉంటారని కొనియాడారు. తనను డీజీపీగా నియమించిన సీఎం కేసీఆర్ కు అంజనీ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. దేశ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ఇంజిన్ లాంటిదని పోలీస్ వ్యవస్థలో టెక్నాలజీ తీసుకురావడానికి మహేందర్ రెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు.

Also Read..

దేశ అభివృద్ధికి తెలంగాణ ఇంజిన్ లాంటిది: అంజనీకుమార్ 

Tags:    

Similar News