ఈడీ విచారణకు అంజన్ కుమార్ యాదవ్ హాజరు

నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బుధవారం ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

Update: 2023-05-31 08:36 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బుధవారం ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. దేశానికి స్వాతంత్రం రాక ముందు ప్రారంభమైన నేషనల్ హెరాల్డ్ పత్రిక 2008 లో మూతబడ్డ విషయం తెలిసిందే. కాగా, 2009లో యూపీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక 2010 లో యంగ్ ఇండియా పేర ఓ ఎన్జీవో సంస్థ ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత నేషనల్ హెరాల్డ్‌ను ఈ సంస్థ సొంతం చేసుకుంది.

ఈ క్రమంలో ఢిల్లీతో పాటు వేర్వేరు నగరాల్లో ఉన్న దాదాపు రూ. 2 వేల కోట్ల ఆస్తులు యంగ్ ఇండియా చేతికి వెళ్లాయి. ఈ యంగ్ ఇండియా సంస్థకు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గతంలో రూ.20 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆయనతో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా లక్షల రూపాయలు విరాళాలుగా ఇచ్చారు. ఈ క్రమంలోనే గతంలో ఈడీ అధికారులు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో అంజన్ కుమార్ యాదవ్‌ను విచారించారు. తాజాగా ఈడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బుధవారం అంజన్ కుమార్ యాదవ్ మరోసారి విచారణకు హాజరయ్యారు.

Also Read.

డీలిమిటేషన్‌తో హై టెన్షన్.. కేంద్రం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ 

Tags:    

Similar News